August 02, 2021

Covaxin 62% Effective Work Delta Plus says ICMR

 భారత్ బయోటెక్ కోవిడ్ -19 వ్యాక్సిన్ కోవాగ్జిన్‌ కరోనా వైరస్ డెల్టా ప్లస్ వేరియంట్‌పై ప్రభావవంతంగా పనిచేస్తుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్చ్(ఐసీఎంఆర్‌) బయో ఆర్‌క్సివ్‌లో ప్రచురించిన అధ్యయనం తెలిపింది. కరోనా వైరస్ డెల్టా ప్లస్ వేరియంట్‌ సోకిన వ్యక్తులకు కోవాగ్జిన్ రెండు డోసుల టీకాలను అందిచడం ద్వారా శరీరంలో ఐజీఎం యాంటీబాడీస్‌ పెరిగి బాధితులు కోలుకున్నట్లు ఈ అధ్యయనంలో పేర్కొన్నారు. మూడో దశ 3 క్లినికల్ ట్రయల్‌లో డెల్టా వేరియంట్‌పై 65.2 శాతం ప్రభావం చూపించినట్లు తెలిపారు. కాగా కోవిడ్‌–19 టీకా కోవాగ్జిన్‌ సామర్థ్యం 77.8 శాతంగా తేలింది. ఇక బి.1.617.2 డెల్టా వేరియంట్‌పై సామర్థ్యం 65.2 శాతంగా తేలింది. తీవ్ర‌మైన కరోనా రాకుండా 93.4శాతం మేర‌కు నిరోధిస్తుంద‌ని తెలింది. వ్యాధి సోకినప్ప‌టికి ఎలాంటి ల‌క్ష‌ణాలు లేని వారికి సైతం 63.6 శాతం మేర ర‌క్ష‌ణ ఉంటుంద‌ని ఐసీఎంఆర్ తెలిపింది.